ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

23 నుంచి జిల్లాలో ఫీవర్ సర్వే..

ఫీవర్ సర్వేలో అధికారులు నిర్లక్ష్యానికి పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ జె.నివాస్ హెచ్చరించారు. సర్వేను పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ నెల 23 నుంచి జిల్లాలో ఫీవర్ సర్వేను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

By

Published : Jun 22, 2021, 10:44 AM IST

fever survey in district
ఫీవర్ సర్వే

ఈ నెల 23 నుంచి జిల్లాలో ఫీవర్ సర్వేను ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఎటువంటి అవకతవకలకు తావులేకుండా సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించారు. 22న ఫీవర్ సర్వేపై మండల స్థాయిలో అధికారులు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచే సర్వే జరుగుతుందన్నారు. నిర్దేశిత ఫారంలను తీసుకుని, ఖచ్చితమైన వివరాలను సేకరించి రాయాలని అధికారులను ఆదేశించారు. జ్వర పీడితుల వివరాలను, లక్షణాల సమాచారం ఖచ్చితత్వంతో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సిబ్బంది ఫీవర్ సర్వేలో నిర్లక్ష్యానికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

OTT: ఆన్‌లైన్‌ వేదికగా అలరించనున్న సురభి నాటకాలు!

ts:తెలంగాణలో ప్రవేశపరీక్షలకు షెడ్యూల్‌ విడుదల

ABOUT THE AUTHOR

...view details