కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న అవుటపల్లి పిన్నమనేని కొవిడ్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సందర్శించారు. ఆసుపత్రిలో కరోనా రోగులకు అందుతున్న సేవలను దృశ్య మాధ్యమం ద్వారా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. భోజనం, అందుతున్న ఇతర సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం రోగులకు అందించాల్సిన మెరుగైన చికిత్స ఇతర అంశాలపై ఆసుపత్రి యాజమాన్యం, నోడల్ అధికారి లాల్ మహ్మద్ తో చర్చించిన కలెక్టర్.. పలు సూచనలు, సలహాలు చేశారు.
కొవిడ్ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ ఇంతియాజ్ - కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్ వార్తలు
కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ గన్నవరం మండలం చిన్న అవుటపల్లి పిన్నమనేని కొవిడ్ ఆసుపత్రిని సందర్శించారు. కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.
collector intiyaaz