ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్​ను జయించిన వారికి.. లక్కీడ్రా ద్వారా బహుమతులు అందజేత - కృష్ణా జిల్లా తాజా వార్తలు

కొవిడ్​ కేర్​ సెంటర్లలో వైద్యం తీసుకుని.. ఆరోగ్యంగా ఇంటికి చేరుకుంటున్న వారితో కృష్ణా జిల్లా కలెక్టరు ఇంతియాజ్‌ మాట్లాడారు. డిశ్చార్జ్​ అయిన వారిలో.. లక్కీడిప్​ ద్వారా ఎంపిక చేసిన వారికి బహుమతులు అందించారు.

collector intiyaaz news
collector intiyaaz news

By

Published : May 20, 2021, 3:24 PM IST

కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొంది.. కరోనాను జయించి ఆరోగ్యవంతంగా ఇళ్లకు చేరుకుంటున్న వారితో కృష్ణా జిల్లా కలెక్టర్​ ఇంతియాజ్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. గూడవల్లి కొవిడ్ కేర్ సెంటర్​లో వైద్యసేవలు పొందుతున్న వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వారంలో డిశ్చార్జ్ అయిన 70 మంది జాబితాతో లక్కీడిప్ నిర్వహించారు. ఇందులో కె. సూర్యనారాయణ తొలి బహుమతిగా రూ.15 వేలు, కె. వెంకట నరసింహ రెండో బహుమతి రూ.10 వేలు, టి.సురేంద్ర మూడో బహుమతి రూ.5 వేలు గెలుపొందారు.

కలెక్టర్ సమక్షంలో తొలిసారిగా.. ఈ లక్కీడిప్​ కార్యక్రమం నిర్వహించారు. వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయిన ఎవరైనా… కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స తీసుకోవచ్చని జిల్లా పాలనాధికారి అన్నారు. ఈ కేంద్రాల్లో అందిస్తున్న వైద్య సేవలు, పౌష్టికాహారం, కల్పిస్తున్న వసతి సౌకర్యాల పట్ల కొవిడ్​ రోగులు హర్షం వ్యక్తం చేశారు. చప్పట్లతో జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:పల్లె వాసులపై... కరోనా పడగ!

ABOUT THE AUTHOR

...view details