కొవిడ్ కేసులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు . బెంగళూరు ,మహారాష్ట్రల్లో న్యూ స్ట్రెయిన్ కేసులు విజృంభిస్తున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలన్నారు. ఈ నెల 25లోపు వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కొవిడ్ టీకా తీసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటి వరకు వైద్య సిబ్బంది 65 శాతం మాత్రమే టీకా వేయించుకున్నారని తెలిపారు. కొవిడ్ వ్యాక్సిన్ పై ప్రజలు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు.
కొవిడ్ వ్యాక్సిన్‌పై అపోహలొద్దు: కలెక్టర్ ఇంతియాజ్ - కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్ తాజా వార్తలు
కొవిడ్ వ్యాక్సిన్‌పై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కొత్త రకం కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
కొవిడ్ వ్యాక్సిన్‌పై అపోహలొద్దు: కలెక్టర్ ఇంతియాజ్