ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు జరుగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్‌ను కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 66 ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రెండు రోజుల్లో ఫ్రంట్ లైన్, హెల్త్ వర్కర్స్కు రెండో డోసులు పూర్తి చేస్తామన్నారు. అనంతరం 45 ఏళ్ల పైబడిన వాళ్లకు రెండో డోసు అందిస్తామని తెలిపారు.
'కొవిడ్ వ్యాక్సినేషన్'ని పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్ - collector intiaz news
కృష్ణా జిల్లాలో జరుగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. రెండు రోజుల్లో ఫ్రంట్ లైన్, హెల్త్ వర్కర్స్కు రెండో డోసు పూర్తి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరు మొదటి డోస్ ఏ వ్యాక్సిన్ తీసుకుంటే రెండో డోసు అదే వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్
నగరంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఏఆర్ గ్రౌండ్స్, మొగల్రాజపురం ఆదాయ పన్ను శాఖ కార్యాలయాల్లో జరుగుతున్న టీకా కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. మొదటి డోసు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో రెండో డోసు అదే వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి