లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన - వరదలు
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కృష్ణా జిల్లాలోని మోపిదేవి, అవనిగడ్డ మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ ఇంతియాజ్ పర్యటించారు.
![లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4170680-174-4170680-1566135460736.jpg)
collector_inthiyaz_visit_flood_affected_areas
లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్
కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణానదికి భారీగా వరద నీరు రావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అన్ని వసతులు కల్పిస్తున్నామని...వరద తగ్గుముఖం పట్టే వరకు పునరావాస కేంద్రాలు కొనసాగిస్తామని తెలిపారు. మునిగిపోయిన పంటపొలాలను గృహాలను ఆయన పరిశీలించారు. బాధితులు ఆందోళన చెందవద్దని త్వరలోనే నష్టపోయిన పంటలకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.