విజయవాడలోని కలెక్టరు క్యాంపు కార్యాలయంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్.. ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు, మత్స్య అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 7 ప్రాసెసింగ్ యూనిట్లలో ప్రస్తుత లాక్‌డౌన్ దృష్ట్యా నాలుగు యూనిట్లు అసంపూర్తిగా పరిమిత కూలీలతో నెట్టుకొస్తున్నాయన్నారు. ఫలితంగా.. జిల్లాలోని రొయ్యల ఉత్పత్తిదారుల పరిస్థితి దారుణంగా ఉందని కలెక్టరు తెలిపారు.
రైతులను గట్టెక్కించేందుకు అవసరమైతే ప్రాసెసింట్ యూనిట్లను టేక్ ఓవర్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించిందని కలెక్టరు హెచ్చరించారు. కృష్ణా జిల్లా రైతులు సాధారణ పరిస్థితుల్లో పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో విక్రయించుకునే వారని అన్నారు. యూనిట్లకు కూలీలు వచ్చేలా, ఇతర రవాణా సమస్యలు పరిష్కరించేలా ఆర్డీఓ, డీఎస్‌ఓ, మత్స్యశాఖ ఏడీలతో కమిటీలు ఏర్పాటు చేశామని.... ఈ కమిటీలు ప్రాసెసింగ్ యూనిట్లకు పూర్తి సహకారం అందిస్తాయని కలెక్టరు తెలిపారు.