రాష్ట్రంలో అంధత్వ నివారణే లక్ష్యంగా కంటి వెలుగు పథకం అమలు కానుందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు. ఈ పథకానికి సంబంధించి విజయవాడలో విజన్ కిట్‌ను అవిష్కరించారు. రేపటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కంటి వెలుగు తొలి దశ కార్యాక్రమం ప్రారంభంకానుందని తెలిపారు. ఉచితంగా కంటి పరీక్షలు, కళ్లజోళ్ల పంపిణీ, ఉచితంగా మందుల పంపిణీ చేస్తామని వివరించారు. అవసరమైతే ఉచితంగానే శస్త్రచికిత్సలు చేస్తారని తెలిపారు.
విజయవాడలో... 'కంటి వెలుగు' విజన్ కిట్ ఆవిష్కరణ - వైఎస్సార్ కంటి వెలుగు
రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న కంటి వెలుగు తొలి దశ కార్యక్రమం సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ విజన్ కిట్‌ను ఆవిష్కరించారు.
కలెక్టర్ ఇంతియాజ్