'కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలి' - కృష్ణా జిల్లాలో కరోనా కేసులు న్యూస్
కృష్ణా జిల్లావ్యాప్తంగా 20,800 కొవిడ్ కేసులు నమోదు అయ్యాయని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.
collector inthiyaz about covid cases in krishna
కేసుల పెరుగుదల పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా అవుతున్నట్లు తమ పరిశీలనలో తేలిందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 శాతం కేసుల నమోదు ఉండగా.. కృష్ణా జిల్లాలో నేటి వరకు 6 శాతం మాత్రమే నమోదు అయ్యాయని కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.