ఈనెల 21న జరగనున్న పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ ఇంతియాజ్ సమీక్ష చేశారు. నూజివీడు డివిజన్ లోని 14 మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 1716 పోలింగ్ కేంద్రాలు, 480 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ సిబ్బందికి మౌళిక వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
'నాలుగో విడత ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి' - ఈరోజు కలెక్టర్ ఇంతియాజ్ తాజా వ్యాఖ్యలు
ఈ నెల 21న నూజివీడు డివిజన్లో నిర్వహించే నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు మరింత సమర్థవంతంగా నిర్వహించాలని... కలెక్టర్ ఇంతియాజ్ అధికారులకు సూచించారు. ఈమేరకు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

కలెక్టర్ ఇంతియాజ్ వీడియో కాన్ఫిరెన్స్
డివిజన్లో 373 ప్రాంతాలను సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. డివిజన్లో పోలింగ్ నిర్వహణకు మొత్తం 1716 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని... వాటిలో 876 సమస్యాత్మకమైనవి కాగా, 840 అతి సమప్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి...