ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్​ ఇంతియాజ్​ సమీక్ష - గణతంత్రదినోత్సవ వార్తలు

విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ మైదానంలో జరగనున్న గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్​ ఇంతియాజ్ అధికారులతో​ సమీక్షించారు. కార్యక్రమంలో పాల్గొనే బెటాలియన్లకు ముందుగానే కరోనా పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో తీసుకొచ్చిన విధివిధానాలను వివరించారు.

collector imtiyaz over republic day arrangements
గణతంత్ర వేడుకల ఏర్పట్లపై కలెక్టర్​ సమీక్ష

By

Published : Jan 20, 2021, 10:30 PM IST

ఈ నెల 26 న జరగనున్న గణతంత్రదినోత్సవానికి విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ మైదానంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నామని కృష్టా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఏర్పాట్లపై సమీక్షించేందుకు సీపీ శ్రీనివాసులు, ఇతర అధికారులతో కలిసి సమావేశమైనట్లు కలెక్టర్ తెలిపారు. కరోనా నేరథ్యంలో కార్యక్రమంలో పాల్గొననున్న బెటాలియన్లకు ముందుగానే కరోనా పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. అతిథులకు వాహన పార్కింగ్, వసతి సౌకర్యాలపై చర్చించామన్నారు.

రైతు భరోసా కేంద్రాల్లోనే ధాన్యం సేకరణ:

రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు జిల్లా వ్యాప్తంగా 755 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. 2020 - 21లో ఖరీఫ్​కు రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 755 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని.. వీటిలో 342 ధాన్యం సేకరణ కోసం అనుసంధానించామన్నారు. 53,337 మంది రైతుల నుంచి రూ. 727.94 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించామన్నారు. వీటికి సంబంధించి రూ. 437.9 కోట్లను రైతులకు ఇప్పటికే చెల్లించామని.. మిగిలిన 290 .85 కోట్ల రూపాయలను త్వరలోనే రైతులకు చెల్లిస్తామన్నారు.

ధాన్యం మద్దతు ధరలు:

నివర్ తుపాన్ కారణంగా జిల్లాలో 93,872 హెక్టార్లలో వరి పంట దెబ్బతినిందని గుర్తించినట్లు తెలిపారు. 10 శాతం అంతకన్నా ఎక్కువ నాణ్యత తగ్గిన ధాన్యాన్ని.. 5 శాతం కింద పరిగణించి కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు. గ్రేడ్ - ఏ వరికి మద్దతు ధర రూ. 1,888గా, గ్రేడ్​-బీ కి రూ. 1,868గా నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతులకు సమస్యలు ఎదురైతే జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రోల్ ఫ్రీ నెంబర్: 1800 425 4402 కు ఫోన్ చేయాలని సూచించారు.

ఇదీ చదవండి:దారుణం.. వ్యక్తిపై 10మంది దుండగులు బ్లేడుతో దాడి

ABOUT THE AUTHOR

...view details