ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టనున్న '‘స్పందన'’ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పాలనాధికారి ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం మండల, డివిజన్, జిల్లా స్థాయి కార్యాలయాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించాలన్నారు. ప్రజలకు జవాబుదారి, పారదర్శకమైన పాలన అందించాలనే ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చేలా పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించనున్న స్పందన కార్యక్రమంలో అర్జీలు దాఖలు చేసి.. ప్రతి వ్యక్తికీ రశీదు ఇవ్వాలన్న కలెక్టర్... ఎన్ని రోజుల్లో ఆ సమస్య పరిష్కారం అవుతుందో తెలియజేయాలని సూచించారు.
స్పందన ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్ - spandana program
జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 8,500 వార్డు వాలంటీర్ల ఉద్యోగాల భర్తీకి కలెక్టర్ ఇంతియాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జులై 5లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయొచ్చన్న కలెక్టర్... 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు, డిగ్రీ విద్యార్హత గల నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులని తెలిపారు.
స్పందన ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్