కృష్ణాజిల్లాలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ సిబ్బందికి క్వార్టర్స్ నిర్మించనున్నారు. కలెక్టర్ ఇంతియాజ్ మచిలీపట్నం ఆర్డీవో ఉదయ భాస్కర్ తో కలిసి క్వార్టర్స్ కు సంబందించిన స్థలాల మ్యాప్ లను పరిశీలించారు. అవనిగడ్డ మండలం పులిగడ్డ శివారు రేగు లంక గ్రామంలో సర్వే నెంబరు 54, 55, 56 లో ఉన్న 46.66 సెంట్ల సోసైటీ భూముల్లో ఎర్రజెండాలను పాతించారు. అనంతరం అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలో ఏర్పాటు కానున్న గ్రామ సచివాలయ భవనాలు పరిశీలిస్తున్నట్టు తెలిపారు. విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో ఈ నెల 24, 25 తేదీల్లో ఎంపికైన వారికి సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందన్నారు.
'డీఆర్డీవో సిబ్బంది క్వార్టర్స్‌కు భూములను పరిశీలించిన కలెక్టర్' - collector imtiaz
కృష్ణా జిల్లా గుల్లలమోదలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ను ఏర్పాటు చేయనున్నారు. సంస్థ సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణం కోసం అధికారులు భూములను పరిశీలించారు. అనంతరం అవనిగడ్డ మండలం రేగు లంక గ్రామంలో పరిశీలించిన భూముల చుట్టూ ఎర్రజెండాలు పాతించారు.
డీఆర్డీవో సిబ్బంది క్వార్టర్స్ కు భూములను పరిశీలించిన కలెక్టర్