కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్.. వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు మచిలీపట్నం వైపు వెళ్తున్నారు. అదే సమయంలో ఈడ్పుగల్లు వద్ద పెనమలూరు మండలం గంగూరుకు చెందిన చెక్క సుష్మ అనే మహిళ.. రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గమనించిన కలెక్టర్ వెంటనే కారు దిగి అక్కడికి వెళ్లారు.
బాధితురాలిని స్వయంగా ప్రత్యేక వాహనంలో పోరంకి క్యాపిటల్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. అక్కడే కాసేపు ఉండి వైద్య సేవలు పరిశీలించారు. అనంతరం బాధితురాలు సుష్మ... తనకు ప్రాణభిక్ష పెట్టారంటూ కలెక్టరుకు కృతజ్ఞతలు తెలిపారు.