కరోనా వ్యాప్తి నియంత్రణకు ఎస్.ఎం.ఎస్ తప్పనిసరి - corona virus latest news krishna district
కరోనా నియంత్రణకు చర్యలకు సంబంధించి రెండు లేదా మూడు సార్లు పొరపాట్లు చేసినట్టు గుర్తిస్తే సదరు వ్యక్తులను క్వారంటైన్‌కు పంపుతామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.
కరోనా వ్యాప్తి నియంత్రణకు ఎస్.ఎమ్.ఎస్ తప్పనిసరి
కరోనా నియంత్రణ చర్యలు కఠినతరం చేయడంలో భాగంగా (ఎస్.ఎం.ఎస్) పరిశుభ్రత (శానిటేషను), మాస్కు ధరించడం(ఎం), భౌతిక దూరం (సోషల్ డిస్టన్స్) పాటించడం తప్పనిసరని కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు చర్యలకు సంబంధించి పొరపాట్లు చేసినట్టు రెండు లేదా మూడు సార్లు గుర్తిస్తే సదరు వ్యక్తులను క్వారంటైన్‌కు పంపుతామని హెచ్చరించారు. కరోనా వైద్యం కోసం జిల్లాలో 18 ఆసుపత్రులను సిద్ధం చేశామని వెల్లడించారు.