కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన లాక్డౌన్ సడలింపులతో కృష్ణా జిల్లాలో సోమవారం నుంచి ప్రార్థనా మందిరాలు, ఆలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగు మాళ్లు తెరిచేందుకు అనుమతించినట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. నిబంధనలు పాటిస్తూ.... ఆయా ప్రాంతాలకు వచ్చే వారు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రజలకు శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్ల యజమానులను ఆదేశించారు. ప్రతి హోటల్, రెస్టారెంట్ 50 శాతం మందినే అనుమతించాలని.. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ సడలింపులు కంటైన్మెంట్ జోన్లు కాని ప్రాంతాలకే వర్తిస్తాయని స్పష్టం చేశారు.
'రెస్టారెంట్లు, హోటళ్లు, షాపింగ్ మాళ్లకు అనుమతి' - krishna district corona news
ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపులతో సోమవారం నుంచి జిల్లాలో రెస్టారెంట్లు, హోటళ్లు, షాపింగ్ మాళ్లు తెరుచుకోవడానికి అనుమతిస్తున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా సహకరించాలని కోరారు.
!['రెస్టారెంట్లు, హోటళ్లు, షాపింగ్ మాళ్లకు అనుమతి' collector explain about the lock down issue at vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7506433-12-7506433-1591463664505.jpg)
మాట్లాడుతున్న కలెక్టర్ ఇంతియాజ్