ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆరుగొలనుపేటలో కలెక్టర్ పర్యటన - collecter visiting in nuzivedu constency

కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో కలెక్టర్ ఇంతియాజ్ పర్యటించారు. ప్రభుత్వ వ్యవస్థల పని తీరును ఆయన పరిశీలించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను పారదర్శకంగా కొనసాగించాలని ఆయన కోరారు.

collecter visiting in nuzivedu constency
నూజివీడు నియోజకవర్గంలో కలెక్టర్ పర్యటన

By

Published : Jan 30, 2020, 4:19 PM IST

నూజివీడు నియోజకవర్గంలో కలెక్టర్ పర్యటన

ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలు పారదర్శకంగా ప్రజలందరికీ అందేలా చూడటం తమ లక్ష్యమని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు. చాట్రాయి మండలం ఆరుగొలనుపేట గ్రామంలో కలెక్టర్ ఇంతియాజ్ పర్యటించారు. ప్రభుత్వ వ్యవస్థల పనితీరును ఆయన పరిశీలించారు. స్వచ్ఛభారత్ లో భాగంగా కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచిందని, ఇప్పటికి సుమారుగా నలభై ఎనిమిది వేల మంది మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, అమ్మ ఒడి పథకాల అమలు పారదర్శకంగా కొనసాగించాలని కొరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్లు సైతం ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరే లాగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details