కరోనాపై పోరులో కీలక ఆయుధంగా భావిస్తున్న ‘మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టెయిల్’ ఔషధం.. అంచనాలను అందుకుంటోంది. ఈ ఔషధం పనితీరులో సానుకూల ఫలితాలు వస్తుండడంతో దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రులు రోగులకు అందిస్తున్నాయి. వైరస్ లక్షణాలు కనిపించిన వారం రోజుల లోపు ఈ డోస్ అందిస్తే... ఆస్పత్రి పాలయ్యే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. ఈ ఔషధంలో ఉండే కాసిరివిమాబ్, ఇండెవిమాబ్‌లు.. వైరస్‌లు శరీర కణాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయంటున్న విజయవాడకు చెందిన హృద్రోగ నిపుణులు శ్రీనివాసచౌదరితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
కాక్‌టెయిల్ ఔషధం పనితీరులో సానుకూల ఫలితాలు: డా.శ్రీనివాస చౌదరి - doctor srinivasa chowdary
కరోనా బాధితులకు అందించే చికిత్సలో కాక్ టెయిల్ ఔషధం కీలక ఆయుధంగా పనిచేస్తున్నట్లు విజయవాడకు చెందిన హృద్రోగ నిపుణులు శ్రీనివాసచౌదరి అన్నారు. ఈ ఔషధంలో ఉండే కాసిరివిమాబ్, ఇండెవిమాబ్‌లు.. వైరస్‌లు శరీర కణాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయని తెలిపారు.

కాక్ టెయిల్ ఔషధం