ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Cocktail antibodies: కాక్‌టెయిల్‌ యాంటీ బాడీస్‌తో కరోనా రోగుల్లో సత్ఫలితాలు - vijayawada news

కరోనా రోగులకు కాక్‌టెయిల్‌ యాంటీబాడీస్‌ ఇవ్వడం వల్ల త్వరితగతిన కోలుకుంటున్నారని ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్‌ కె.గోపాలకృష్ణ తెలిపారు. ఇటీవల ప్రయోగాత్మకంగా విజయవాడలో ఇద్దరికి ఇలా చికిత్స అందించినట్లు ఆయన తెలిపారు.

coctail anti bodies treatment
కాక్‌టెయిల్‌ యాంటీ బాడీస్‌తో కరోనా రోగుల్లో సత్ఫలితాలు

By

Published : May 29, 2021, 11:38 AM IST

కాక్‌టెయిల్‌ యాంటీ బాడీస్‌ చికిత్సపై ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్‌ కె.గోపాలకృష్ణ...

కరోనాపై పోరాటంలో భాగంగా.. యాంటీ బాడీ కాక్‌టెయిల్‌ మందు ఇప్పుడు రాష్ట్రంలోనూ అందుబాటులోకి వచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో.. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు కరోనా పాజిటివ్‌ వచ్చినపుడు ఈ మందు తీసుకున్నారు. అదే ఏడాది నవంబర్‌లో అమెరికా ఈ కాక్‌టెయిల్‌ యాంటీ బాడీ మందుకు.. అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది.

వేగంగా ఇస్తే ఉపయోగం ఎక్కువ..

కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధరణ అయిన బాధితులు.. తొలి 5 నుంచి 10 రోజుల్లోపు ఈ మందు వాడితే సత్ఫలితాలిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ చికిత్సా విధానం ద్వారా ఆసుపత్రిలో చేరికను 70 శాతం తగ్గించొచ్చనేది వైద్యులు అంటున్నారు. ప్రాణాపాయం కూడా తగ్గుతుందని పేర్కొంటున్నారు. విజయవాడలో తొలిసారిగా ఇద్దరు కొవిడ్ బాధితులకు గురువారం ఈ కాక్‌టెయిల్‌ యాంటీబాడీస్‌ అందించారు. కరోనా చికిత్సలో ఈ కాక్‌టెయిల్‌ యాంటీబాడీస్‌ ప్రామాణికతను ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్‌ కె.గోపాలకృష్ణ ముఖాముఖిలో వివరించారు.

ABOUT THE AUTHOR

...view details