ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంపాపురంలో జోరుగా కోళ్ల పందేలు - cock races in Ampapuram, Krishna district

అక్కడ పందేలకు అడ్డులేదు.! సౌకర్యాలకు కొదవలేదు.! వినోదానికిలోటులేదు.! ఇంకేముంది కారులు బారులు తీరాయి. బరులు కిక్కిరిశాయి. పుంజులు ప్రతాపం చూపాయి. కరెన్సీ నోట్లు చేతులు మారాయి. మొత్తంగా కోడిపందేలు జనజాతరనుతలపించాయి

అంపాపురంలో జోరుగా కోళ్ల పందేలు
అంపాపురంలో జోరుగా కోళ్ల పందేలు

By

Published : Jan 15, 2021, 4:07 AM IST

Updated : Jan 15, 2021, 5:01 AM IST

అంపాపురంలో జోరుగా కోళ్ల పందేలు

భారీ టెంట్లు...... వరుసకట్టిన వాహనాలు.. గుమికూడిన జనాలు.... వీక్షకుల కోసం సోఫాలు...చూశారుగా ఈ హంగామా....! ఇక్కడమీ తాయిలాలు పంచడంలేదు. అమ్మవారి జాతరో, పోలేరమ్మ తిరునాళ్లో జరగడంలేదు. మరి.. ఇంత జనం ఏంటి అనేగా మీ సందేహం.! ఇది ఏటా సంక్రాంతికి జరిగే కోడిపందేల జాతర.....! మూడురోజుల పందేల కోసం..... కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని అంపాపురం వద్ద ఏర్పాటు చేసిన బరులే ఇవి.

ఇక్కడి పందేలను తిలకించేందుకు... కృష్ణా జిల్లా నుంచేకాదు.. హైదరాబాద్‌ నిుంచీ వీక్షకులు వచ్చి వాలిపోయారు. ఇలా వందల సంఖ్యలో..... బారులు తీరిన కార్లు,బైకులు వాళ్లవే. ఇంత జనాన్ని చూసి ఆశ్చర్యపోకండి. ఇక్కడున్నఏర్పాట్లు అలాంటివి మరి. ఎండపడకుండా పెద్ద టెంట్లు,.... దర్జాగా కూర్చుని పందేలు తిలకించేలా సోఫాలు.! దూరంగా ఉన్నవారికీ బాగా కనిపించేలా పెద్ద ఎల్​ఈడీ తెరలు ఇలా సౌకర్యాలకు లోటులేకుండా చేశారు నిర్వాహకులు! అందుకే మహిళలుసైతం ముందువరుసలో కూర్చుని.. కోడిపందేలను యమఆసక్తిగా తిలకించారు.పండుగ సందడంతా ఇక్కడే ఉదంటూ సంబరపడ్డారు. ఇక్కడ కోడిపందేలతోపాటు ఇతర క్రీడలు వినోదాన్ని పంచాయని సంతృప్తి వ్యక్తంచేశారు.

బరుల వద్ద ఏర్పాట్లే.... ఈరేంజ్‌లో ఉంటే ఇక్కడ పందేలు ఈ మేరసాగి ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కరెన్సీనోట్లు.. ఇదిగో ఇలా బహిరంగంగానే చేతులుమారాయి. పందేలు సంప్రదాయబద్ధంగానేజరిగాయంటున్ననిర్వాహకులు సందర్శకుల ఆనందమే తమ ఆనందం అంటూ... కానిచ్చేస్తున్నారు.

అంపాపురంలో జోరుగా కోళ్ల పందేలు


సందర్శకుల తాడిడి ఎక్కువవడంతో ట్రాఫిక్‌ రద్దీ కూడా పెరిగింది.వీక్షకుల్ని మరింతగా ఆకర్షించేందుకు..... కనుమ సందర్భంగా ఎడ్లపందేలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు

ఇవీ చదవండి

మరో మూడు రోజుల పాటు శీతల గాలులు: ఐఎండీ

Last Updated : Jan 15, 2021, 5:01 AM IST

ABOUT THE AUTHOR

...view details