ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా జిల్లాలో కోడి పందేల జోరు... భారీగా తరలివచ్చిన పందెం రాయుళ్లు - ampapuram cock fight latest news

కోడి పందేలు నిర్వహించేందకు అనుమతులు లేవనీ... బరులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించినా.. పందేలు ఆగలేదు. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోడి పందేలు జోరుగా జరుగుతున్నాయి.

cock fight
అంపాపురంలో కోడి పందేలు

By

Published : Jan 14, 2021, 1:41 PM IST

Updated : Jan 14, 2021, 2:38 PM IST

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురంలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పందేలు కాసేందుకు పందెం రాయుళ్లు భారీగా బరుల వద్ద ఉన్నారు. కోళ్ల పందేలు చూసేందుకు స్థానికులు, చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

నందిగామలో...

సంక్రాంతి పండుగ పురస్కరించుకుని నందిగామ నియోజకవర్గంలో భారీగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. చందర్లపాడు మండలం పెండ్యాల, కంచికచెర్ల, మండలాల్లో బరులు ఏర్పాటు చేసి కోడి పందాలు జరుపుతున్నారు. వీటివైపు పోలీసులు కన్నెత్తి చూడట్లేదు. పండగకు రెండు రోజులు ముందు హడావుడి చేసిన పోలీసులు, అధికారులు ప్రస్తుతం కోడి పందాల శిబిరాలకు అనధికారిక అనుమతులు ఇచ్చి చోద్యం చూస్తున్నారు.

దీంతో పందెంరాయుళ్లు మరింత రెచ్చిపోతున్నారు. పార్టీలకు అతీతంగా కోడి పందాల శిబిరాల ఏర్పాటు చేసి పోటీలు నిర్వహిస్తున్నారు. చందర్లపాడు మండలంలో రెండు ప్రధాన పార్టీలు వేర్వేరుగా శిబిరాలను నిర్వహిస్తున్నాయి. కృష్ణా-గుంటూరు జిల్లాలకు చెందిన పలు ప్రాంతాల నుంచి భారీగా జనం బరుల వద్దకు చేరుకున్నారు. కోడి పందాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి.

ఇదీ చదవండి:

మంచు జల్లులో మెరిసిపోతున్న గడ్డిమొక్కలు

Last Updated : Jan 14, 2021, 2:38 PM IST

ABOUT THE AUTHOR

...view details