విజయవాడ నగర శివారు అజిత్ సింగ్ నగర్ అంబాపురం ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కన సంక్రాంతి పండుగ సందర్భంగా భారీగా కోడి పందాలు, గుండాట నిర్వహించారు. వేడుకలు మాటన కోట్ల రూపాయిలు చేతులు మారుతున్నాయి. పోలీసులు నుంచి తప్పించుకునేందుకు.. నిర్వాహకులు ప్రైవేట్ సెక్యూరిటీతో చెక్ పొస్టులు ఏర్పాటు చేశారు. పోలీస్ ఆంక్షలు ఉన్నప్పటికీ భారీగా జనం గుమిగూడి గుంపులుగా పందేలు కాస్తున్నారు. ఈ పందేల్లో లక్షల రూపాయిలు చేతులు మారుతున్నప్పటికీ, విజయవాడ నగర పోలీసులు అటు వైపు కన్నెతి చూడకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
విజయవాడలో యథేచ్చగా కోడి పందాలు - today vijayawada police latest news update
కోడి పందాలు, గుండాట నిర్వహించకూడదన్న ఆంక్షలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా యథేచ్చగా పందాలు కొనసాగిస్తున్నారు. విజయవాడ నగరంలో పలు చోట్లు జనం భారీగా ఒకే చోట చేరి పందాలు కాస్తున్నారు.
![విజయవాడలో యథేచ్చగా కోడి పందాలు cock betings Ignored by the police in Vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10248469-475-10248469-1610693890025.jpg)
విజయవాడలో యథేచ్చగా కోడి పందాలు