కృష్ణా జిల్లా అవనిగడ్డ, నాగాయలంక మండలాలకు చెందిన 52 మంది లబ్దిదారులకు రూ.19 లక్షల 47 వేలు విలువ చేసే చెక్కులను అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పంపిణీ చేశారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వైద్యం కూడా చేయించుకొలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా కల్పిస్తోందని ఆయన అన్నారు.
నియోజకవర్గంలోని 6 మండలాలకు.. దాదాపు రూ.56 లక్షలకు పైచిలుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెక్కులు మంజూరు అయ్యాయని చెప్పారు. దివి మార్కెట్ కమిటీ ఛైర్మన్ కడవకొల్లు నరసింహారావు, అవనిగడ్డ పంచాయతీ సర్పంచ్ గొర్రుముచ్చు ఉమా, స్థానిక వైకాపా నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కరోనాతో అప్రమత్తం..