ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై సీఎం సమాధానం చెప్పాలి' - ఎస్​ఈసీ వ్యవహారంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఎస్​ఈసీ వ్యవహారంలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రైతుల కష్టాలు ప్రభుత్వానికి వినబడటం లేదా అని నిలదీశారు.

devineni uma
devineni uma

By

Published : Jun 10, 2020, 6:19 PM IST

Updated : Jun 10, 2020, 7:35 PM IST

మీడియాతో మాజీ మంత్రి దేవినేని ఉమ

ఎస్​ఈసీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ వైఖరి సరిగాలేదనటంతో పాటు ఇటువంటి ఆర్డినెన్స్​ను ఎలా ఆమోదిస్తారన్న సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలకు సీఎం జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలాడొద్దని జగన్​కు సుప్రీంకోర్టు స్పష్టం చేయటంతో పాటు ఎస్ఈసీ రమేష్ కుమార్ తొలగింపునకు సంబంధించిన ఆర్డినెన్స్ దురుద్దేశ పూర్వకంగా ఉందని సుప్రీం తేల్చి చెప్పిన సంగతి జగన్ గ్రహించాలని ఆయన హితవు పలికారు.

మరోవైపు పంట నష్టాలతో, అమ్ముడుగాని ఉత్పత్తులతో అన్నదాతల ఆత్మహత్యలు బాధాకరమని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల బాధలతో తనువులు చాలిస్తున్న రైతన్నల బాధలు తాడేపల్లి రాజప్రసాదానికి వినిపిస్తున్నాయా? అని నిలదీశారు. విశాఖ మన్యంలో మంత్రి మేనల్లుడి మైనింగ్ మాఫియా.... లేటరైట్ ముసుగులో బాక్సైట్ తరలిస్తోందని ఆయన ఆరోపించారు. సీఎం జగన్ సొంత కంపెనీ సరస్వతి పవర్​కి 50ఏళ్ల లీజుపొడిగింపు బరితెగింపు చర్యని ఆక్షేపించారు.

ఇదీ చదవండి

రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారినెలా తొలగిస్తారు?: సుప్రీం

Last Updated : Jun 10, 2020, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details