గోదాములు, శీతల గిడ్డంగుల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రూ.4 వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ఆర్బీకే పరిధిలో గోదాములు, గ్రేడింగ్, సార్టింగ్ యంత్రాలు ఏర్పాటుచేయనున్నారు. ప్రతి మండలానికి శీతల గిడ్డంగి ఉండాలని అధికారులకు సీఎం సూచించారు. పంట ఉందని రైతు ఆర్బీకేకు తెలిపితే సెంట్రల్ సర్వర్‌కు చేరాలని సూచించారు. రైతు తన పంటను అమ్ముకునేలా మార్కెటింగ్ శాఖ తోడ్పాటు ఇవ్వాలని ఆదేశించారు. కనీస గిట్టుబాటు రాకపోతే ధరల స్థిరీకరణ నిధితో రైతును ఆదుకోవాలని అధికారులకు తెలిపారు. సెప్టెంబర్ నెలకల్లా సంబంధిత సాఫ్ట్‌వేర్ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
4 వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం : సీఎం - ఏపీలో వ్యవసాయ మార్కెటింగ్ న్యూస్
వ్యవసాయ మార్కెటింగ్‌ను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులుకు పలు సూచనలు చేశారు. ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంట ఉందని రైతు ఆర్బీకేకు తెలిపితే సెంట్రల్ సర్వర్‌కు చేరాలని సూచించారు. రైతు తన పంటను అమ్ముకునేలా మార్కెటింగ్ శాఖ తోడ్పాటు ఇవ్వాలన్నారు.
cm review