ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోదీపై నా ఆరోపణలు అబద్దమైతే రాజీనామా..! మన్మోహన్ హయామే బాగుంది:సీఎం కేసీఆర్ - అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

CM KCR Interesting Comments: సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యంత విఫలమైన ప్రధాని మోదీయేనని విమర్శించారు. మన్మోహన్‌ హయాంలో ద్రవ్యలోటు 4.77 శాతం.. మోదీ హయాంలో 5.1 శాతం అని పేర్కొన్నారు. తాను ప్రస్తావించిన లెక్కల్లో ఒక్కమాట అబద్ధం ఉన్నా.. రాజీనామా చేస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

By

Published : Feb 12, 2023, 8:08 PM IST

CM KCR Interesting Comments : ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ పాలనలో ఏ ఒక్క రంగంలోనైనా వృద్ధి రేటు ఉందా అని ప్రశ్నించారు. మన్మోహన్‌ హయాంలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 12.73 శాతం.. మోదీ హయాంలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 7.1 శాతం అని పేర్కొన్నారు. అప్పు చేయడంలో మోదీని మించిన ప్రధాని లేరని ఎద్దేవా చేశారు. డెట్‌ టు జీడీపీ మోదీ హయాంలో పెరిగిందని.. ఇది ఎవరూ కాదనలేని సత్యం అని స్పష్టం చేశారు.

మన్మోహన్ హయాంలో డెట్‌ టు జీడీపీ 52.2 శాతం.. మోదీ హయాంలో 56.2 శాతం అని కేసీఆర్ పేర్కొన్నారు. మూలధన వ్యయం మన్మోహన్‌ హయాంలో 37 శాతం.. మోదీ హయాంలో 31 శాతం అని వివరించారు. మన్మోహన్‌ హయాంలో ద్రవ్యలోటు 4.77 శాతం.. మోదీ హయాంలో 5.1 శాతం అని వెల్లడించారు. తాను ప్రస్తావించిన లెక్కల్లో ఒక్కమాట అబద్ధం ఉన్నా.. రాజీనామా చేస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.

దేశంలో అత్యంత విఫలమైన ప్రధాని మోదీయే... మేకిన్ ఇండియా, విశ్వగురు ఎటుపాయే అని కేసీఆర్ వ్యంగాస్త్రాలు సంధించారు. మన్మోహన్‌ హయాంలో పారిశ్రామిక వృద్ధిరేటు 5.87 శాతం.. మోదీ హయాంలో 3.27 శాతం అని తెలిపారు. మన్మోహన్ కాలంలో రూపాయి విలువ 58.6 అయితే.. మోదీ హయాంలో 82.6 అని వివరించారు. దేశంలో అత్యంత విఫలమైన ప్రధాని మోదీయేనని ఆరోపించారు. కాంగ్రెస్‌ హయాంలో ఆయన లైసెన్స్‌ రాజ్‌.. మోదీ హయాంలో సైలెన్స్‌ రాజ్‌ అని ఎద్దేవా చేశారు.

ఎన్‌డీఏ అంటే.. నో డాటా ఎవైలబుల్...కేంద్రం రూ.20 లక్షల కోట్లు ఎంఐఎంఈలకు ఇచ్చామన్నారని.. అవి ఎక్కడకు పోయాయో తెలియదని కేసీఆర్ ఆరోపించారు. ఒకే ఒక్క వందేభారత్‌ రైలును మోదీ ఇప్పటికి 14 సార్లు ప్రారంభించారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. అదానీ అంశంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంటే.. మోదీ తన ప్రసంగంలో ఆ ప్రస్తావనే తీసుకురాలేదని మండిపడ్డారు. హిండెన్‌బర్గ్ లేవనెత్తిన అంశంపై ప్రధాని వివరణ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు. 60, 40 ఏళ్ల కిందటి నెహ్రూ, ఇందిరాగాంధీల పాలనను విమర్శిస్తోన్న మోదీ.. అదానీ విషయం చెప్పకుండా సంబంధం లేని విషయాలు పార్లమెంట్‌లో ప్రసంగించారని కేసీఆర్ దుయ్యబట్టారు. తలసరి ఆదాయంలో భారత్‌ ర్యాంకు 139గా ఉందని పేర్కొన్న కేసీఆర్​.. బంగ్లాదేశ్‌, భూటాన్, శ్రీలంక కంటే మన తలసరి ఆదాయం తక్కువుందని విమర్శించారు.

దేశ పౌరసత్వాన్ని వదులుకునే దౌర్భాగ్యం ఎందుకు?..దేశ రాజధాని దిల్లీలోనూ తాగునీటికి దిక్కులేదని పేర్కొన్నారు. రత్నగర్భల్లాంటి దేశంలో కనీస అవసరాలు తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో గ్రీన్‌కార్డు వస్తే పండుగ చేసుకునే పరిస్థితి నెలకొందని వివరించారు. 8 ఏళ్లలో 20 లక్షల మంది భారతీయ పౌరసత్వం వదులుకున్నారని అన్నారు. దేశ పౌరసత్వాన్ని వదులుకునే దౌర్భాగ్యం ఎందుకని కేసీఆర్ ప్రశ్నించారు.

"ఎన్నికల్లో పార్టీలు, నేతలు గెలుస్తున్నారు.. ప్రజలు ఓడుతున్నారు. మన్మోహన్ సింగ్‌ మంచి వ్యక్తి.. పని ఎక్కువ.. ప్రచారం తక్కువ. మన్మోహన్‌ సింగ్‌.. మోదీ కంటే ఎక్కువ మంచి పనులు చేశారు. మన్మోహన్‌, మోదీ పాలనపై పూజామెహ్రా 'ద లాస్ట్‌ డెకేడ్‌' పుస్తకం రాశారు. మన్మోహన్ పాలనతో పోలిస్తే మోదీ హయాంలో దేశం ఘోరంగా దెబ్బతిన్నది." - కేసీఆర్, సీఎం

సీఎం కేసీఆర్

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details