ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గన్నవరంలో సీఎం జగన్ విమానం అత్యవసర ల్యాండింగ్.. ప్రత్యేక విమానంలో దిల్లీకి - Cm Flight emergency landing

flight
విమానం

By

Published : Jan 30, 2023, 5:52 PM IST

Updated : Jan 30, 2023, 10:49 PM IST

17:45 January 30

రాత్రి 9గంటల తర్వాత దిల్లీకి సీఎం జగన్​

గన్నవరంలో సీఎం జగన్ విమానం అత్యవసర ల్యాండింగ్

CM Flight Emergency landing: సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దిల్లీ వెళ్లే విమానం గన్నవరం ఎయిర్​పోర్ట్​లో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ల్యాండింగ్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5.03 గంటలకు బయలుదేరిన విమానం.. 5.26 గంటలకు అత్యవసరంగా ల్యాండ్‌ అయినట్లు తెలుస్తోంది. దీంతో దిల్లీ వెళ్లాల్సిన జగన్‌.. గన్నవరం విమానాశ్రయ లాంజ్​లో కాసేపు వేచి చూశారు. అనంతరం అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. సీఎం వెంట సీఎస్‌ జవహార్‌ రెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డి, అధికారులు పూనం మాలకొండయ్య, కృష్ణ మోహన్‌రెడ్డి, చిదానందరెడ్డి ఉన్నారు.

సీఎం జగన్ దిల్లీ వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం ప్రత్యేక విమానాన్ని విమానాశ్రయ అధికారులు ఏర్పాటు చేయడంతో.. రాత్రి 9 గంటల సమయంలో దిల్లీకి బయల్దేరారు. సీఎం జగన్‌ వెంట ఉన్నతాధికారుల బృందం దిల్లీ వెళ్లింది.

దిల్లీ చేరుకున్న తర్వాత జగన్‌.. రాత్రికి 1 జనపథ్‌ నివాసంలో బస చేయాల్సి ఉంది. మంగళవారం దిల్లీలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో దౌత్యవేత్తలతో జరగనున్న ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లో జగన్ పాల్గొనాల్సి ఉంది. ఈ సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 30, 2023, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details