యాస్ తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
'అప్రమత్తంగా ఉండాలి'
అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు. శ్రీకాకుళం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్.. మూడు జిల్లాల్లో పరిస్థితులను సీఎంకు వివరించారు. తాత్కాలిక నిర్మాణాల్లో కొవిడ్ రోగులు లేకుండా, ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఇవీ చూడండి:
నేడు తీరం దాటనున్న అతి తీవ్ర తుపాను యాస్.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో హెచ్చరికలు