గుండెపోటుతో మరణించిన కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా(MLC Kareemunnisa dead) భౌతిక కాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కరీమున్నిసా కుటుంబ సభ్యులను సీఎం జగన్(CM Jaganmohan Reddy ) ఓదార్చారు.
ముఖ్యమంత్రితోపాటు హోం మంత్రి సుచరిత, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు కూడా ఎమ్మెల్సీ కరీమున్నిసా భౌతికకాయానికి నివాళులర్పించారు.
ఎమ్మెల్సీ కరీమున్నిసా గుండెపోటుతో నిన్న(నవంబర్19) అర్ధరాత్రి మృతిచెందారు. శాసనమండలి సమావేశం తర్వాత ఇంటికి వచ్చిన ఆమె రాత్రి 11.30 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పారు. దాంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రెండు హాస్పటల్స్‌కు తరలించారు. కానీ ఆమె మృతిచెందారు.
వైకాపా కార్పొరేటర్‌గా గెలుపొందిన కరీమున్నీసాకు ఈ ఏడాది ఎమ్మెల్సీగా జగన్ అవకాశం కల్పించారు. నిన్న ఉదయం శాసనమండలిలో సీఎం జగన్, శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును ఆమె కలిశారు. కానీ.. అంతలోనే అకాల మరణం చెందారు. కరీమున్నీసాకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు.
ఇదీ చదవండి:MLC Karimunnisa passed away: ఎమ్మెల్సీ కరీమున్నిసా కన్నుమూత