Welcome to New Governor : రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో సీఎం పుష్పగుచ్ఛం, శాలువాతో ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఎస్ జవహర్‌రెడ్డి, మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు, మంత్రి జోగి రమేష్, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా, ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమల రావు గవర్నర్ కు స్వాగతం పలికారు. అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకున్న గవర్నర్ దంపతులకు గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ ఘన స్వాగతం పలికారు. సూర్యప్రకాష్, సంయుక్త కార్యదర్శి తదితర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర మూడో గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.
అయెధ్య, త్రిపుల్ తలాక్ తీర్పులో... కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించగా.. జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. గతంలో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేయగా.. రామజన్మభూమి ఆయోధ్య కేసులో తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్‌లో ఆయన ఒకరు. ఇప్పటివరకు ఇక్కడ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా వెళ్లారు.