ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి పేర్ని నాని కుటుంబానికి సీఎం పరామర్శ - పేర్ని నానిపై సీఎం జగన్ వ్యాఖ్యలు

మంత్రి పేర్ని నాని కుటుంబాన్ని ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. రెండ్రోజుల కిందట మంత్రి పేర్ని నాని మాతృమూర్తిని కోల్పోయారు.

cm jagan visit miniser perni nani house
మంత్రి పేర్ని నాని కుటుంబాన్ని పరామర్శించిన సీఎం

By

Published : Nov 21, 2020, 2:30 PM IST

రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట రామయ్య (నాని) కుటుంబాన్ని సీఎం జగన్ పరామర్శించారు. రెండు రోజుల క్రితం మంత్రి పేర్ని నానికి మాతృ వియోగం కలిగింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మంత్రి తల్లి నాగేశ్వరమ్మ(82) .. మచిలీపట్నంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2 రోజుల క్రితమే డిశ్చార్జి అయ్యారు. గురువారం ఉదయం మళ్లీ అస్వస్థతకు గురై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నాగేశ్వరమ్మ భర్త పేర్ని కృష్ణమూర్తి గతంలో మంత్రిగా పనిచేశారు.

ABOUT THE AUTHOR

...view details