CM Jagan Skips Welfare of Kalyana Mitra: కల్యాణమిత్రల ప్రోత్సాహలనూ పెంచుతానన్న జగన్.. వారి పొట్టగొట్టారు CM Jagan Skips Welfare of Kalyana Mitra : "నేను ముఖ్యమంత్రిగా కొనసాగినంతకాలం కల్యాణమిత్రలుగా మీరే ఉంటారు. పెళ్లిళ్లు నిర్వహిస్తారు. పగలు జరిగే పెళ్లికి ఇచ్చే 250 రూపాయల ప్రోత్సాహకాన్ని 500కి, రాత్రి జరిగే పెళ్లికిచ్చే మొత్తాన్ని 500 రూపాయల నుంచి వెయ్యికి, క్షేత్రస్థాయి తనిఖీకిచ్చే మొత్తాన్ని 300 రూపాయల నుంచి 600కు పెంచుతాం." 2019 జులై 5న తనను కలిసిన కల్యాణమిత్రలకు సీఎం జగన్ ఇచ్చిన హమీ ఇది.
Kalyana Mitra Payments Pending: జగన్ ఈ మాటలు చెప్పి ఇప్పటికి మూడేళ్లు గడిచిపోయాయి. కానీ వారికిచ్చిన హామీని మాత్రం జగన్ నెరవేర్చలేదు. ప్రోత్సాహకం పెంచడం అటుంచి ఏకంగా వారి ఉపాధిపైనే దెబ్బ కొట్టారు. వారికి నెలకు వచ్చే 10 వేల నుంచి 20 వేల రూపాయల సంపాదనను దూరం చేశారు.
"జగన్ మీ బిడ్డ. ఎన్నికలప్పుడు ఒకలా, ఎన్నికలైన తర్వాత మరో మాదిరిగా, ఎన్నికల కోసం ఇంకోలా ఉండేవాడు కాదు మీ జగన్. మీ బిడ్డకు నిజాయతీ ఉంది. మీ బిడ్డకు నిబద్ధత ఉంది. ఏది చెబుతాడో అనే చేస్తాడు." ఇది 2022 జూన్ 14న పత్రికల్లో ఇచ్చిన ప్రకటనల్లో ముఖ్యమంత్రి జగన్ ఉద్ఘాటన. ఇంతకి జగన్ చెప్పింది ఎంత గొప్పగా చేస్తారో తెలుసుకునేందుకు కళ్యాణమిత్రలు ఉపాధి కోల్పోవడమే చక్కటి ఉదాహరణ.
Bhima Mitra: "హామీలు సరికదా.. కనీసం సమస్యలనూ పరిష్కరించలేదు"
ఉన్న ఊరులోనే ఉపాధి చేతి నిండా పని కుటుంబానికి చేదోడుగా నిలిచేలా ఆదాయం. ఇదీ కల్యాణమిత్రల ఉద్యోగం. చంద్రన్న పెళ్లి కానుక పథకం అమలు కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1800 మందిని కల్యాణమిత్రలుగా నియమించింది. అప్పటి సర్కారు నిర్దేశించిన విధంగా పెళ్లికానుక ఆర్థిక సాయాన్ని ఠంచన్‌గా లబ్ధిదారులకు అందించి వారి మన్ననలనూ పొందారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఊతంగా ఈ పథకం నిలిచింది.
కానీ జగన్‌కు కన్ను కుట్టిందేమో అధికారంలోకి వచ్చిన మొదటి నెలన్నర రోజుల్లోనే కల్యాణమిత్రలను కొనసాగిస్తామని భరోసా ఇచ్చిన ఆయన ఆ తరువాత నిర్ధాక్షిణ్యంగా పక్కన పెట్టేశారు. తమను విధుల్లో కొనసాగించాలని ఆ మహిళలు గొంతు చించుకుని మొరపెట్టుకున్నా జగన్ మనసు కరగలేదు.
1800 Kalyanamitras Appointment in TDP Government :గత తెలుగుదేశం ప్రభుత్వం 2018 ఏప్రిల్ నుంచి పెళ్లికానుక పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. మండలాలు, వార్డుల ప్రాతిపదికగా 1800 మంది డ్వాక్రా మహిళల్ని కల్యాణమిత్రలుగా నియమించింది. ఆ సంవత్సరంలో 83 వేల కొత్త జంటలకు ఆర్థిక సాయాన్ని దగ్గరుండి అందించారు. వైసీపీ అధికారంలోకొచ్చాక 2019-20లో లక్షా 28 వేల వివాహాలు జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేసి పెళ్లి కానుక కోసం 718 కోట్ల రూపాయలు అవసరమని ప్రతిపాదించారు.
Injustice to Grain Farmer under YCP Regime: ధాన్యం సేకరణను తగ్గించుకున్న ప్రభుత్వం.. దిక్కుతోచని స్థితిలో రైతు
సీఎం జగన్ భరోసా మేరకు పాత కల్యాణమిత్రలే ఆ ఏడాది వివాహాల నమోదు ప్రక్రియ బాధ్యతలు చూశారు. కానీ జగన్ సర్కారు 2019-20లో ఆ పథకాన్ని అమలు చేయలేదు. ఆ తర్వాత రెండేళ్లు పట్టించుకోలేదు. చివరకు ప్రజాసంఘాలు కోర్టుకెళ్లడంతో ఎట్టకేలకు గతేడాది చివరి నుంచి అమల్లోకి తెచ్చింది. కానీ కల్యాణమిత్రలను (CM Jagan Removed Kalyanamitras )మాత్రం సీఎం జగన్ తొలగించారు.
ముఖ్యమంత్రి జగన్ మాటలు నమ్మి కల్యాణమిత్రలు దాదాపుగా ఏడాది పాటు పని చేశారు. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు పని చేసిన కాలానికి కొంత బకాయి పెట్టింది. జగన్ ప్రభుత్వమూ పని చేయించుకుంది. మొత్తంగా ఒక్కో కల్యాణమిత్రకు వారు పని చేసిన కాలానికి 50 వేల నుంచి 90 వేల రూపాయ చొప్పున ప్రభుత్వం బకాయి పడింది. ఇది మొత్తంగా సుమారు 3 కోట్ల రూపాయల నుంచి 4 కోట్ల మేర ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికీ వైసీపీ సర్కార్ వాటిని చెల్లించలేదు. జగన్ చెప్పినట్టు ప్రోత్సాహకాన్ని పెంచి ఇవ్వకపోయినా కనీసం పాత లెక్కల ప్రకారమైనా బకాయిలు, విడుదల చేయాలని కల్యాణ మిత్రలు కోరుతున్నారు. బకాయిల గురించి అధికారులను అడిగితే మరచిపొమ్మంటున్నారని కల్యాణమిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
CM Jagan Cheated Anganwadi Workers: అంగన్వాడీలను నిలువునా ముంచిన జగన్ సర్కార్..ఇచ్చిన హామీలను మర్చిపోయిన ప్రభుత్వం