ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పారిశ్రామిక వేత్తలకు ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటా : సీఎం జగన్

By

Published : Feb 1, 2023, 7:22 AM IST

Preparatory Summit of Global Investors: ఆంధ్రప్రదేశ్​లో పరిశ్రమల స్థాపనకు అత్యుత్తమ సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ఫోన్‌కాల్‌ దూరంలోనే అందుబాటులో ఉంటానన్నారు. దిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సమిట్​లో సీఎం పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి జగన్
ముఖ్యమంత్రి జగన్

Preparatory Summit of Global Investors: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే ఏ పారిశ్రామికవేత్తకైనా ఎలాంటి అసౌకర్యం కలిగినా ఒక్క ఫోన్‌కాల్‌ దూరంలో అందుబాటులో ఉంటానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. పరిశ్రమల స్థాపనకు అత్యుత్తమ సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. దిల్లీలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సన్నాహక సమిట్‌ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు.

పారిశ్రామిక వేత్తలకు ఫోన్ కాల్ దూరంలోనే అందుబాటులో ఉంటా : రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా ఉంటుందని... రవాణా, మౌలిక సదుపాయాల పరంగా ఎంతో అనుకూల ప్రాంతమని సీఎం జగన్ అన్నారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమిట్‌కు సన్నాహకంగా దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ఫోన్‌కాల్‌ దూరంలోనే అందుబాటులో ఉంటానన్న ఆయన... భూమి, నీరు, విద్యుత్‌ మిగతా రాష్ట్రాల కన్నా తక్కువ ధరకే అందిస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్‌లో గ్రీన్‌ ఎనర్జీలో ఏపీ కీలకపాత్ర పోషించబోతుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ అనుకూలం : ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని.. వాటిని పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలని అసోచామ్‌ అధ్యక్షుడు సుమంత్ సిన్హా పిలుపునిచ్చారు. పునరుత్పాదక, శుద్ధ ఇంధన ప్రాజెక్టులకు ఏపీ అంత్యంత అనుకూలమన్నారు. గ్లోబల్ ఇన్విస్టర్స్‌ సమిట్‌కు జాతీయ పారిశ్రామిక భాగస్వామిగా సీఐఐ వ్యవహరిస్తున్నందుకు సంతోషంగా ఉందని.. సీఐఐ సదరన్ రీజియన్ ఛైర్‌ పర్సన్ సుచిత్ర ఎల్లా అన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది మంచి వేదిక అవుతుందన్న ఆమె... పారిశ్రామికవేత్తలు ఈ విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు.

రవాణా, మౌలిక వసతులు, పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాలు కలిగి ఉండటంతో పాటు సులభతర వాణిజ్యంలో దేశంలోనే ఏపీ తొలిస్థానంలో ఉండటం కలిసొచ్చే అంశమని నాస్కామ్ అధ్యక్షురాలు దేవయాని ఘోష్‌ కొనియాడారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details