ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీవో​ 3పై తెలంగాణతో సమన్వయం చేసుకోండి: సీఎం జగన్ - జీవో నంబర్ 3పై సీఎం జగన్ సమీక్ష

జీవో నంబర్ 3ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిన నేపథ్యంలో దానిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై అధికారులతో సీఎం జగన్ సమాలోచనలు జరిపారు. గిరిజనుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

cm jagan
cm jagan

By

Published : May 10, 2020, 7:10 PM IST

Updated : May 10, 2020, 7:25 PM IST

ఐటీడీఏల పరిధిలోని ఉపాధ్యాయ ఉద్యోగాల్లో గిరిజనులకు నూరు శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో నంబర్ 3ను సుప్రీంకోర్టు కొట్టేసిన దృష్ట్యా అడ్వకేట్‌ జనరల్‌తో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సుప్రీంతీర్పుపై చర్చించారు. జీవోను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిన క్రమంలో గిరిజన వర్గాల్లో ఆందోళన నెలకొందని ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యేలు... సీఎం దృష్టికి తీసుకువచ్చారు. తమకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన వారిలో ఉందని నేతలు వెల్లడించారు.

గిరిజనుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. తీర్పును అధ్యయనం చేసి న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచించాలన్నారు. ఉమ్మడి ఏపీలో విడుదలైన జీవో అయినందువల్ల తీర్పు ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఉంటుందన్న సీఎం... తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ముందడుగు వేయాలని సూచించారు.

Last Updated : May 10, 2020, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details