ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ' - ఏపీలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు వార్తలు

సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నిర్మించనున్న నైపుణ్యాభివృద్ధి కళాశాలలపై సమీక్షించిన సీఎం... వీటి నిర్మాణం పూర్తయ్యాక విద్యార్థుల సర్వే చేయాలని ఆదేశించారు.

cm jagan
cm jagan

By

Published : Jun 18, 2020, 7:48 PM IST

రాష్ట్రంలో నిర్మించనున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, కంపెనీలకు మధ్య నిరంతర సంబంధాలు ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నిర్మించనున్న నైపుణ్యాభివృద్ధి కళాశాలలపై సీఎం సమీక్షించారు. 30 చోట్ల నిర్మించనున్న కళాశాలల నిర్మాణ నమూనాలను సీఎంకు అధికారులు చూపించారు. నిర్మాణానికి 1210 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. 30 కళాశాలల్లోనూ 20 రంగాలకు చెందిన అంశాలపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నారు.

సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని సీఎం సూచించారు. కళాశాలల నిర్మాణం పూర్తయ్యాక ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థుల వివరాలపై సర్వే చేయాలని ఆదేశించారు. దాదాపు 120 కోర్సుల్లో బోధన, నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇప్పించనున్నారు. కోర్సుల్లో కియా, ఐటీసీ, టెక్ మహీంద్ర, హెచ్​సీఎల్, హ్యుందాయ్, వోల్వో, బాష్ వంటి కంపెనీల భాగస్వామ్యం ఉండనుంది. ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏపీ-ఎస్​సీహెచ్​ఈ, త్రిబుల్ ఐటీ బోధనా సిబ్బందితో అడ్వాన్స్​డ్ కోర్సుల్లో శిక్షణ ఇప్పించనున్నారు.

ఇదీ చదవండి:'నాలుగు రోజుల్లో ముగ్గురు మాజీ మంత్రులపై తప్పుడు కేసులు'

ABOUT THE AUTHOR

...view details