సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్‌సీ నారాయణరెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సకాలంలో పూర్తి చేయాలి..
పోలవరం, వెలిగొండ, అవుకు ప్రాజెక్టుల పనుల పురోగతిని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. రాష్ట్రంలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోలవరం, వెలిగొండ, అవుకు టన్నెల్ –2 పనుల్లో జాఫ్యం లేకుండా కొనసాగించాలని నిర్దేశించారు. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, కాలువలుకు సంబంధించి పనుల పురోగతిని వివరించిన అధికారులు.. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, నిర్ణీత వ్యవధిలో పూర్తవుతుందని పేర్కొన్నారు.
గ్రావిటీ ద్వారా పరిశీలించాలి..
పోలవరం ప్రాజెక్టు అప్రోచ్, స్పిల్ ఛానెల్ పనులు మే నాటికి పూర్తి చేయాలని.. అంతకుముందే కాఫర్ డ్యాం పనులు కూడా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. పోలవరం నుంచి విశాఖపట్నానికి తాగునీటి అవసరాలు తీర్చేలా ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి పంపింగ్ లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని తరలించే ఏర్పాటును పరిశీలించాలని, తద్వారా పవర్ వినియోగం లేకుండా చూడాలన్నారు.
బ్యాక్ వాటర్‌తో సమస్యలు రాకూడదు..
పోలవరం ప్రాజెక్టులో నీరు 41.15 అడుగుల స్థాయికి చేరినప్పటికీ.. బ్యాక్ వాటర్‌తో ఎక్కడా సమస్యలు రాకూడదని, ఇబ్బందులు తలెత్తకుండా భూసేకరణ, ఆర్అండ్ఆర్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో నిర్వాసితులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
దానికి నెలవారీగా నిధులు విడుదల..