ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2 వేల జబ్బులు: సీఎం జగన్​ - సీఎం జగన్ తాజా వార్తలు

సీఎం జగన్ నేడు వైద్య ఆరోగ్య శాఖపై మేధోమథన సదస్సు నిర్వహించారు. 'మన పాలన-మీ సూచన' పేరిట అధికారులతో సమావేశమయ్యారు. ఏడాదిలో వైద్య ఆరోగ్య శాఖలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్ష చేపట్టారు. అనంతరం వైద్య రంగ నిపుణులు, లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు.

cm jagan review meeting on health department
వైద్యారోగ్య రంగంపై సీఎం జగన్ మేధోమథన సదస్సు

By

Published : May 29, 2020, 4:02 PM IST

Updated : May 30, 2020, 7:47 AM IST

రాష్ట్రంలోని మరో 6 జిల్లాల్లో జులై 8 నుంచి డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద వైద్యసేవలను విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రయోగాత్మకంగా అదనంగా వెయ్యిరకాల వైద్యసేవలను పశ్చిమగోదావరి జిల్లాలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. వీటిలోని 200 రకాల సేవలు ఇతర జిల్లాల్లో ఉన్నాయని, అవికాక మరో 800 రకాల సేవలను జులైలో 6 జిల్లాలు, నవంబరులో మిగిలిన జిల్లాల్లో అమలుచేస్తామని ఆయన వెల్లడించారు. ‘మన పాలన-మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖపై వైద్యులు, ప్రయోజనం పొందిన రోగులతో ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుబంధ ఆస్పత్రులకు వెంటనే చెల్లింపులు జరుగుతున్నాయి. దీనివల్ల రోగులు ఆస్పత్రులకు వెళ్తే యాజమాన్యాలు చిరునవ్వుతో వైద్యసేవలు అందిస్తున్నాయి. 1.42 కోట్ల కుటుంబాల్లో 1.33 కోట్ల కుటుంబాలకు ‘క్యూఆర్‌’ కోడ్‌ కార్డులు పంపిణీ చేశాం. మిగిలిన వారికి 2 వారాల్లో అందజేస్తాం. వైద్యసేవలు అందిన తర్వాత విశ్రాంతి సమయంలో ఆసరా కింద నగదు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి పింఛన్లు ఇస్తున్నాం’’ అని చెప్పారు.

వారంలో నోటిఫికేషన్లు
వారంలోగా 9,712 (వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌, ఇతర పోస్టులు) ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు ఇస్తామని సీఎం వెల్లడించారు. ‘‘నెలన్నర లోగా ఈ నియామకాలు పూర్తిచేస్తాం. నాడు-నేడు కింద ఉప ఆరోగ్యకేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుత 11 బోధనాసుపత్రులు కాకుండా అదనంగా మరో 16 వైద్య కళాశాలలు, ఏజెన్సీల పరిధిలో ఏడు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు రాబోతున్నాయి. రూ.12,270 కోట్లతో చేపట్టబోతున్న ఈ పనులకు ఆగస్టులో టెండర్లు పిలుస్తాం. 13వేల వరకు విలేజీ/వార్డుల్లో వైఎస్సార్‌ క్లినిక్‌లు రాబోతున్నాయి. ప్రజారోగ్యంపై రూ.16వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం’’ అని తెలిపారు.

సీఎం, పీఎంలకు బాగా లేకున్నా..
ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాలకు తగ్గట్లు ప్రభుత్వాసుపత్రుల్లో మందులను అందుబాటులోకి తెస్తున్నట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు. ‘‘నాకు ఆరోగ్యం బాగా లేకున్నా.. పీఎంకు బాగా లేకున్నా ప్రభుత్వాసుపత్రుల్లో మంచి మందులు దొరుకుతాయి. నాకు నచ్చిన ‘కంటి వెలుగు’ పథకం కింద 70 లక్షల మంది చిన్నారులకు పరీక్షలు చేయించాం. రాబోయే రోజుల్లో 46వేల మంది విద్యార్థులకు శస్త్రచికిత్సలు చేయిస్తాం’’ అని వెల్లడించారు.

‘కరోనా’ యుద్ధంలో ఏపీ అగ్రగామి
కరోనా వైరస్‌పై యుద్ధం చేయడంలో ఏపీ అగ్రస్థానంలో ఉందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ‘‘ఈ యుద్ధంలో పాల్గొంటున్న అందరికీ అభినందనలు. అత్యవసర వైద్యసేవల కోసం అన్ని కేటగిరీల్లో కలిపి 38వేల పడకలు సిద్ధం చేశాం. ఈనెల 25 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించిన ‘మన పాలన-మీ సూచన’ సదస్సుల్లో వచ్చిన సలహాలు, సూచనలు తీసుకుని రాబోయే ఏడాది కాలంలో మరింత మెరుగైన పాలన అందిస్తాను’’ అని ప్రకటించారు.

Last Updated : May 30, 2020, 7:47 AM IST

ABOUT THE AUTHOR

...view details