ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Jagananna Thodu Funds: సకాలంలో చెల్లించిన వారికి కొత్త రుణాలు: సీఎం జగన్‌ - jagananna thodu funds

జగనన్న తోడు పథకాన్ని(Jagananna Thodu Funds) ఇకపై ఏడాదిలో రెండు విడతల్లో కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్, డిసెంబర్ నెలల్లో కార్యక్రమం ఏర్పాటు చేసి వడ్డీల చెల్లింపు.. సహా కొత్త రుణాలు మంజూరు చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు(cm jagan released jagananna thodu funds news). ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Jagananna Thodu Funds
Jagananna Thodu Funds

By

Published : Oct 20, 2021, 3:20 PM IST

సీఎం జగన్‌

చిరు వ్యాపారులకు 'జగనన్న తోడు పథకం' కింద వడ్డీ నిధులను ముఖ్యమంత్రి జగన్ నిధులు విడుదల చేశారు(Jagananna Thodu Funds news). తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. కంప్యూటర్ బటన్ నొక్కి నిధులు జమ చేశారు. గతేడాది నవంబర్​లో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 4లక్షల50 వేల546 మందికి.. 16.36 కోట్ల వడ్డీని విడుదల చేశారు. ఇప్పటివరకు 9 లక్షల 5 వేల 458 మందికి రూ.905 కోట్లు వడ్డీ లేని రుణాలు (cm jagan released jagananna thodu funds news) ఇచ్చినట్లు ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు.

మొదటి విడతలో గతేడాది నవంబర్​లో 5 లక్షల 35 వేలు, జూన్ 8 నుంచి రెండో విడతలో 3లక్షల 70 వేల మందికి రుణాలు ఇచ్చామని సీఎం(cm jagan on jagananna thodu funds news) వివరించారు. చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు, హస్త కళాకారులు, సాంప్రదాయ, చేతివృత్తుల కళాకారులకు లబ్ధి చేకూర్చనున్నట్లు పేర్కొన్నారు. చిరువ్యాపారులపై వడ్డీ భారం పడకుండా వాళ్ల కాళ్లపై వారు నిలబడేందుకే కార్యక్రమం చేపట్టినట్లు సీఎం వివరించారు. సకాలంలో వడ్డీ చెల్లించిన వారికి ఆ మొత్తాన్ని లబ్ధిదారులకు ప్రభుత్వం తిరిగి ఇస్తోందన్నారు. ఇకపై ఏడాదిలో రెండు సార్లు జగనన్న తోడు కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం ప్రకటించారు. ఏటా డిసెంబర్, జూన్​లో అప్పటివరకు రుణాలు చెల్లించిన వారికి వడ్డీల చెల్లింపు సహా కొత్త లోన్లు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

వెంటనే చెల్లించండి..

ఎవరైనా లోన్లు తీసుకుని చెల్లించకపోతే అందరూ వెంటనే చెల్లించాలని సీఎం సూచించారు. ఓవర్ డ్యూ ఉన్న వారు, చెల్లించని వారు డిసెంబర్ నాటికి రుణాలు చెల్లించాలని, ఇలా చేస్తే వడ్డీని తిరిగి చెల్లించడం సహా తిరిగి లోన్​ను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. రుణాల చెల్లింపునకు సబంధించి ఏవైనా అనుమానాలుంటే 08912890525 నెంబర్​కు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని సీఎం తెలిపారు. పార్టీలకు అతీతంగా పారదర్శకంగా పథకాలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రెండున్న ఏళ్లలో అందరినీ సంతృప్తపరిచేలా పాలన చేశామని, ఇకపైనా కొనసాగిస్తాని స్పష్టం చేశారు.

'చిరువ్యాపారులకు అండగా జగనన్న తోడు పథకం ప్రవేశపెట్టాం. సకాలంలో చెల్లించినవారికి కొత్త రుణాలు ఇస్తాం. వాటితోపాటు చెల్లించిన వడ్డీ వెనక్కి ఇస్తాం. అభివృద్ధి చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. కోర్టులకు వెళ్లి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు' - జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి

ఇదీ చదవండి

CM Jagan: అభిమానులకు బీపీ వచ్చింది.. రియాక్ట్ అయ్యారు: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details