సీఎం జగన్‌కి ప్రచార ఆర్భాటంపై ఉన్న శ్రద్ధ మహిళలకు రక్షణ కల్పించడంపై లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. తొలి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభమైన రాజమండ్రిలో బాలిక సామూహిక అత్యాచారానికి గురైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వ ఏడాది పాలనలో 234 అత్యాచార, వేధింపుల ఘటనలు జరిగాయని.. సీఎం జగన్ చెప్పినట్టు ఒక్క మహిళకైనా 21 రోజుల్లో న్యాయం జరిగిందా? అని నిలదీశారు. దిశ తప్పిన దిశ చట్టాన్ని పట్టాలెక్కించి నేరస్తులను కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
'దిశ తప్పిన దిశ చట్టాన్ని పట్టాలెక్కించండి'
దిశ చట్టం దిశ తప్పిందని నారా లోకేశ్ ఆరోపించారు. దిశ చట్టాన్ని పట్టాలెక్కించి నేరస్తులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంపై సీఎం జగన్‌కు శ్రద్ధ లేదని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలు లేవని, కోవిడ్ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందటం లేదని బాధితులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో కరోనా బాధితుడు మోహనరావు కోవిడ్ ఆసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదని, తన ప్రాణాలు కాపాడాలని సెల్ఫీ వీడియో ద్వారా వేడుకున్నారని తెలిపారు. ఆ తర్వాత జిల్లా అధికారులు స్పందించారని...,ప్రజల ప్రాణాలు పోతున్నా పాలకులు నిర్లక్ష్యం వీడరా అని నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియోను లోకేశ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి: 'సెప్టెంబర్ 5 న పాఠశాలలు పున: ప్రారంభించే అవకాశం'