కరోనా జాగ్రత్తలపై మరింత సమాచారం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాట్బోట్లను ఆవిష్కరించారు. సామాజిక మాధ్యమాలైన వాట్సప్, ఫేస్బుక్ మెసెంజర్ల ద్వారా కోవిడ్ -19 సమాచారాన్ని తెలుసుకోవచ్చు. 8297104104 నెంబరుతో వాట్సప్ చాట్‌లో వివరాలు, ఫేస్ బుక్ మెసెంజర్‌లోనూ ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. ఈ చాట్‌బోట్ ద్వారా తెలుగు, లేదా ఆంగ్ల మాధ్యమాల్లో వివరాలను తెలుసుకునే వీలుంది. హాయ్ అని టైప్ చేస్తే చాలు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అధికారిక సమాచారం కోవిడ్ -19 నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవచ్చు.
కరోనా సమాచారం కావాలంటే... 8297104104 నెంబర్ కొట్టండి - ఏపీలో కరోనా వార్తలు
కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కూడిన సమగ్ర సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు ప్రత్యేత నంబర్ ను అందుబాటులోకి తెచ్చింది. కరోనా జాగ్రత్తల సమాచారాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాట్బోట్లను ఆవిష్కరించారు.
చాట్బోట్లను ఆవిష్కరించిన సీఎం జగన్
Last Updated : Apr 11, 2020, 10:04 PM IST