ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహనాలు.. విజయవాడలో ప్రారంభించిన సీఎం - cm jagan inaugurates ration supply vehicles news

పేదలకు నిత్యావసర సరకులను నేరుగా ఇంటికే పంపిణీ చేసేందుకు అందుబాటులోకి తెచ్చిన రేషన్ పంపిణీ వాహనాలను సీఎం జగన్ ప్రారంభించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద రేషన్ పంపిణీ వాహనాలకు పచ్చ జెండా ఊపారు.

cm jagan starts ration supply vehicles
సీఎం జగన్

By

Published : Jan 21, 2021, 11:17 AM IST

Updated : Jan 21, 2021, 11:31 AM IST

ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహనాలు ప్రారంభించిన సీఎం జగన్

విజయవాడ బెంజ్ సర్కిల్​లో సీఎం జగన్ చేతుల మీదుగా.. రేషన్ సరకుల పంపిణీ వాహనాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1 నుంచి ఇంటి వద్దకే చౌక డిపో సరకులు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ఈ విధానం శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలవుతోంది.

539 కోట్ల రూపాయల వ్యయంతో.. 9,260 వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. నిరుద్యోగులకు 60 శాతం సబ్సిడీతో వాహనాలను అందజేశారు. ఒక్కో వాహనం ద్వారా రోజుకు సగటున 90 ఇళ్లకు సరుకులు పంపిణీ చేయనున్నారు.

Last Updated : Jan 21, 2021, 11:31 AM IST

ABOUT THE AUTHOR

...view details