కరోనాను ముఖ్యమంత్రి జగన్ సీరియస్గా తీసుకోవటం లేదని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. గవర్నర్ బంగ్లాలో, సీఎం పేషీలో కూడా కరోనా వచ్చిందని బుద్దా చెప్పారు. తెలంగాణలో కేసుల సంఖ్య తగ్గుతోందన్న ఆయన.. కేసీఆర్ను చూసి జగన్ నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రలో పర్యటించి శ్రీకాకుళానికి కరోనా అంటించారని దుయ్యబట్టారు.
ఉత్తరాంధ్ర సీఎం మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనా వైరస్ భయంకరమైంది కాబట్టే ప్రపంచ దేశాలు లాక్డౌన్ను పాటిస్తుంటే జగన్ మాత్రం అవగాహన లేమితో మాట్లాడుతున్నారని విమర్శించారు. రికార్డెడ్ ప్రెస్ మీట్లను ఎందుకు విడుదల చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.