ఇటీవల నోటిఫికేషన్ జారీ అయిన ఎమ్మెల్సీ స్ధానానికి వైకాపా అభ్యర్ధిగా పోతుల సునీత నామినేషన్ దాఖలు చేశారు. ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సీఎం జగన్.. బీ ఫారమ్ అందజేశారు. సీఎం నెల్లూరు పర్యటనకు వెళ్లే ముందు జగన్‌ను తాడేపల్లిలోని నివాసంలో సునీత కలిశారు.
సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితురాలై వైకాపాలో చేరానని ఆమె స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన మూడు నెలలకు సీఎం జగన్ తనను మళ్లీ అభ్యర్ధిగా బీఫారం ఇచ్చారని అన్నారు. తనను అభ్యర్ధిగా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి సునీత కృతజ్ఞతలు తెలిపారు.