వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ మేధోమథన సదస్సు నిర్వహించారు. ఏడాదిలో వైద్య ఆరోగ్య శాఖలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పనితీరును వివరించారు. రాష్ట్రంలో 3.42 లక్షల కరోనా టెస్టులు చేశామని సీఎం జగన్ తెలిపారు. మిగిలిన రాష్ట్రాల కంటే అత్యధిక పరీక్షలు ఏపీలోనే జరిపామని .... రాష్ట్రంలో రికవరీ 65.49 శాతం ఉందని ఆయన అన్నారు. కరోనా బారినపడి 98 శాతం మంది కోలుకుంటున్నారని... కేవలం 2 శాతం మంది మాత్రమే చనిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. 85 శాతం మంది ఇంట్లోనే వైద్యం తీసుకుంటున్నారని.. అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. కొవిడ్ పోయేదికాదని.. మనతోపాటు ఎప్పటికీ ఉంటుందని.. కొవిడ్‌తో సహజీవనం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా సోకిన వారిని అంటరానివారిగా చూడవద్దని ఆయన కోరారు. కరోనాతో జ్వరం వస్తుంది, పోతుందని... అది వస్తే ఏదో జరిగిపోతుందని అనుకోవద్దని ప్రజలకు సూచించారు. ఇంట్లో పెద్దవాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలని...కరోనా నివారణకు కృషి చేస్తున్నామని...ప్రజలంతా జాగ్రత్తగా ఉంటూ..ప్రభుత్వానికి సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
'కరోనా సోకిన వారిని అంటరానివారిగా చూడవద్దు' - సీఎం జగన్ మేధోమథన సదస్సు
కరోనా సోకిన వారిని అంటరానివారిగా చూడవద్దని సీఎం జగన్ సూచించారు. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ మేధోమథన సదస్సు నిర్వహించారు. ఏడాదిలో వైద్య ఆరోగ్య శాఖలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పనితీరును వివరించారు. కరోనా పరీక్షలు మన రాష్ట్రంలోనే అత్యధికంగా చేశామని ఆయన అన్నారు. కోవిడ్ మనతోనే ఉంటుందని..ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.
!['కరోనా సోకిన వారిని అంటరానివారిగా చూడవద్దు' cm jagan conference on corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7393271-993-7393271-1590741902406.jpg)
సీఎం జగన్