ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CM Jagan Comments on Punganur Incident: ప్రజలను రెచ్చగొట్టేందుకు విపక్షనేతలు ప్రయత్నిస్తున్నారు: సీఎం జగన్‌ - Punganur

CM_jagan_Comments_On_Punganur_Incident
CM_jagan_Comments_On_Punganur_Incident

By

Published : Aug 11, 2023, 1:16 PM IST

Updated : Aug 11, 2023, 2:56 PM IST

13:09 August 11

అనుమతి లేని రూట్‌లో వెళ్లొద్దని చెప్పినా వినలేదు: సీఎం జగన్‌

CM Jagan Comments on Punganur Incident : ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే చూడలేక... విపక్ష నేతలు ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. పుంగనూరు ఘటన చూసి తనకు చాలా బాధ కలిగిందన్న జగన్‌... ఇలాంటి నేతలకు ఎందుకు రక్షణ కల్పించాలా అనిపించిందన్నారు. అంగళ్లులో చంద్రబాబు స్వయంగా కార్యకర్తలను రెచ్చగొట్టారని సీఎం జగన్‌ ఆరోపించారు. పుంగనూరులో అనుమతి లేని రూట్‌లో వెళ్లేందుకు ప్రయత్నించారని, అనుమతి లేని రూట్‌లో వెళ్లొద్దని చెప్పినా వినలేదని అన్నారు. చంద్రబాబు.. 47 మంది పోలీసులకు గాయాలయ్యేలా చేశారన్న జగన్‌.. చంద్రబాబు కారణంగా ఓ పోలీసుకు కన్నుపోయిందని పేర్కొన్నారు. శవరాజకీయాలకు సైతం చంద్రబాబు వెనుకాడట్లేదని, వాలంటీర్లను కూడా వదలకుండా దారుణంగా మాట్లాడారని అన్నారు.

Last Updated : Aug 11, 2023, 2:56 PM IST

ABOUT THE AUTHOR

...view details