ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు - speaker camp office latest news

శ్రీకాకుళం జిల్లాలో సీఎం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు. కేక్​ కట్​ చేసి.. జగన్​కు శుభాకాంక్షలు తెలిపారు.

cm birthday celebrations
సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు

By

Published : Dec 21, 2020, 7:14 PM IST

ఆమదాలవలసలోని స్పీకర్ క్యాంపు కార్యాలయంలో సీఎం జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం కేక్ కట్ చేసి.. జగన్​కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు, నాయకులకు మిఠాయిలు పంపిణీ చేశారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు సంబరాలతో రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొందని తమ్మినేని సీతారాం అన్నారు.

టెక్కలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

జిల్లాలోని కాశీబుగ్గలో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డా. ఎస్. అప్పలరాజు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను అన్ని వర్గాల వారు జరుపుతున్నారని ఆయన అన్నారు.

ఇచ్చాపురంలో సీఎం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. డీసీఎంఎస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడే కేకు కట్​ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పలువురు యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పిరియా విజయ, వైకాపా రాష్ట్ర కార్యదర్శి నర్తు రామారావు, ఇచ్చాపురం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చాట్ల సుజాత తులసీదాసు రెడ్డి, సాడి శ్యాం ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:సీఎం జగన్​కు సైకత శిల్పంతో జన్మదిన శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details