Class war in YSRCP:వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ల మార్పు,సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుడంతో అధికార పార్టీలో వర్గ విభేదాలు బయట పడుతున్నాయి. దీంతో ఆ పార్టీలో రోజు రోజుకు ముసలం ముదురుతోంది. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రాజీనామాతో మొదలైన ఈ అసంతృప్తి రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటోంది. అదే సమయంలో సీఎం జగన్ నియోజక వర్గ ఇన్ఛార్జ్లను మార్చడం కూడా ఆ పార్టీ నేతల్లో నిప్పు రాజేసింది. ఈ నిప్పు ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనం.
సమన్వయకర్తల నియామకంతో వైఎస్సార్సీపీలో రగడ - రోజురోజుకీ ముదురుతున్న వర్గపోరు
MLA Parthasarathy Comments: తాజాగా వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తన అసంతృప్తిని బయటపెట్టారు. కృష్ణా జిల్లా కంకిపాడులో వైసీపీ నిర్వహించిన సామాజిక సాధికార సభ వేదికగా విభేదాలు బయటపడ్డాయి. సీఎం జగన్ తనను అవమానించారని ఎమ్మెల్యే పార్ధసారధి అన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో అన్ని కులాలు తనని ఆదరించినా సీఎం జగన్ గుర్తించకపోవటం దురదృష్టకరం అంటూ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అవమానాలు ఎదురైనా ప్రజలే తనని కాపాడుతారంటూ స్పష్టం చేశారు. పార్థసారథి వ్యాఖ్యల అనంతరం వెంటనే మంత్రి జోగి రమేష్ వేదిక నుంచి వెళ్లిపోయారు. నేతలు ఆపుతున్నా ఆగకుండా మంత్రి జోగి రమేష్ వెళ్లిపోయారు. ఇలా ఒక్కరిగా పార్టీ అధిష్టానంపై తమ అసంతృప్తిని బయటపెడుతుండటం పార్టీ పెద్దలను కలవర పెడుతోంది.