ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్రిక్తతకు దారి తీసిన అక్రమ నిర్మాణాల తొలగింపు - కృష్ణా జిల్లా వార్తలు

కృష్ణా జిల్లా కేసరపల్లిలో అక్రమ కట్టడాల తొలగింపులో రెవెన్యూ అధికారులు, నివాసితుల మధ్య వివాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న తహసీల్దార్ శ్రీనివాసరావు... వారికి ప్రభుత్వ నివేశన స్థలాలు కేటాయిస్తామని హామీ ఇవ్వటంతో వివాదం సర్దుమణిగింది.

clash
వివాదం

By

Published : Jun 13, 2021, 11:05 AM IST

కేసరపల్లిలో అక్రమ నిర్మాణదారులు, రెవెన్యూ సిబ్బంది మధ్య ఘర్షణ

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో అక్రమ కట్టడాల తొలగింపు వ్యవహారంలో వాగ్వాదం చోటు చేసుకుంది. వీఎన్‌పురం కాలనీ శివారు పంట కాలువలపై అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు తొలగిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. నూజివీడు సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగిస్తున్నమని రెవెన్యూ సిబ్బంది తెలిపారు.

స్థానికులు, అధికారులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై రమేష్ బృందం, తహసీల్దార్ శ్రీనివాసరావు... వారితో మాట్లాడారు. నివాసితులకు ప్రభుత్వ నివేశన స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత వివాదం సర్దుమణిగింది.

ABOUT THE AUTHOR

...view details