కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ, లంకవాని దళితవాడలో బుధవారం అర్ధరాత్రి కొంత మంది మద్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో ముగ్గురు వ్యక్తులు కత్తిపోటుకు గురయ్యారు. పాత గొడవల నేపథ్యంలో బుధవారం రాత్రి మద్యం సేవించి గొడవలు పడినట్లు సమాచారం.
గాయపడిన వారికి చల్లపల్లి ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. లంకా నాగబాబు ఇచ్చిన ఫిర్యాదుపై చల్లపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘర్షణకు పాత కక్షలే కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు చల్లపల్లి సీఐ వెంకట నారాయణ తెలిపారు.