కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట గ్రామసభలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. జల జీవన్ మిషన్ కమిటీలో ముగ్గురు గ్రామస్థులకు చోటు కల్పించాల్సి ఉండగా... వారంతా తెదేపా మద్దతుదారులే ఉన్నారని వైకాపా సభ్యులు ఆరోపించారు. తమ పార్టీకి చెందిన వారు ఉండాలని పట్టుబట్టారు. కమిటీలో అప్పటికే చేర్చిన వారి పేర్లు తొలగించాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా వైకాపా కార్యకర్తలు తీర్మానం పుస్తకం చించబోయారు. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ చోటు చేసుకుంది. ఈ వివాదంలో తెదేపా కార్యకర్త శ్రీనివాసరావు, వైకాపా వార్డు సభ్యుడు రమేశ్ గాయపడ్డారు. వారిని చికిత్స కోసం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
clash between TDP and ycp: గ్రామసభలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ - కృష్ణా జిల్లా తాజా సమాచారం
కృష్ణా జిల్లా అన్నేరావుపేట గ్రామసభలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య వివాదం జరిగింది. జల జీవన్ మిషన్ కమిటీలో గ్రామస్థులకు చోటు కల్పించే విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో తెదేపా కార్యకర్త, వైకాపా వార్డు సభ్యుడు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం నూజివీడు ఆసుపత్రికి తరలించారు.

clash between TDP and ycp